పవార్‌ల చేతిలో పవర్: సీఎం ఎవరో డిసైడ్ చేసేది వాళ్లే..

Maharashtra Assembly elections polling 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్.. ప్రారంభంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో గవర్నర్ ఓటు వేశారు. రాజ్‌భవన్.. ముంబైలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది.

Maharashtra Governor CP Radhakrishnan and RSS Chief Mohan Bhagwat cast their votes

బారామతి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అజిత్ పవార్. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి వరుసగా ఏడుసార్లు ఘన విజయం సాధించారాయన. ఎనిమిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోన్నారు. యుగేంద్ర పవార్‌తో తలపడుతున్నారు.

ఓటు వేసిన అనంతరం అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది మహాయుటి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. మరోసారి సుపరిపాలనను అందించబోతోన్నామని పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

నాగ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను అతిపెద్ద పండగగా భావిస్తామని, ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను ఉత్తరాఖండ్‌లో ఉన్నప్పటికి ఓటు వేయడానికే వచ్చానని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో పవార్ కీలక పాత్రను పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు శరద్ పవార్, ఇటు అజిత్ పవార్.. ఏ కూటమికి మద్దతు ఇస్తే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారనేది స్పష్టమౌతోంది. నంబర్ గేమ్‌లో అజిత్ పవార్ మహాయుటి కూటమిలో, శరద్ పవార్, మహా వికాస్ అఘాడీలో కీలకం మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+