
మహారాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం ఏక్‌నాథ్ షిండే: ఇంధనంపై వ్యాట్ తగ్గింపు!
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుభవార్త చెప్పారు. ఇంధనంపై వ్యాట్‌ను ప్రభుత్వం త్వరలో తగ్గించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. ఈ మేరకు పీటీఐ నివేదించింది.
'ఇంధనంపై వ్యాట్ తగ్గించే నిర్ణయం రాష్ట్ర క్యాబినెట్‌లో తీసుకోవడం జరుగుతుంది' అని షిండే ఫ్లోర్ టెస్ట్‌లో గెలిచిన తర్వాత చర్చకు సమాధానమిస్తూ చెప్పారు. అంటే, త్వరలోనే మహారాష్ట్రలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర తగ్గనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ 144 కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. షిండేకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.
సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా అంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 99 ఓట్లు పడ్డాయి.
మరోవైపు, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన మరో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. మహారాష్ట్ర సీఎం షిండే వర్గంలోకి చేరారు. బంగర్ సోమవారం ఉదయం షిండే వర్గ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. కాగా, ఎవరూ ఊహించని విధంగా జూన్30న ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిం