మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎంవీఏ కూటమి హవా -తామే గెలిచామంటోన్న బీజేపీ
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం బీజేపీతో అంటకాగి, సడెన్‌గా కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపిన తర్వాత కూడా రాష్ట్రంలో శివసేన ప్రభావం యధావిధిగా కొనసాగుతోంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, దానికి దాదాపు సమాన స్థాయిలో శివసేన సీట్లు సాధించింది. ఆ రెండు పార్టీలకు ధీటుగా ఎన్సీపీ అభ్యర్థులు గెలవగా, కాంగ్రెస్ సైతం చక్కటి ప్రదర్శన ఇచ్చింది. మొత్తంగా శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, తాను కూడా గెలిచినట్లు బీజేపీ ప్రకటించుకుంది..
మహారాష్ట్రలోని 34 జిల్లాల్లోగల 14,234 గ్రామపంచాయితీలకు గత వారం ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్ధతిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం, కొవిడ్ ప్రొటోకాల్ కారణంగా కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. రాత్రి 10 గంటల వరకు 12, 503 పంచాయితీల్లో లీడ్లు వెలవడ్డాయి. ఆ లెక్కల ప్రకారం..

ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని మొత్తం 14,234 పంచాయితీలకుగానూ, 2,912 చోట్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో లేదా విజయం సాధించారు. 2,724 పంచాయితీల్లో శివసేన అభ్యర్థులు లీడ్ లేదా గెలుపు సాధించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బలపర్చిన అభ్యర్థులు 2,673 పంచాయితీల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1905 పంచాయితీలను కైవసం చేసుకునే దిశగా వెళుతున్నారు. 2,289 పంచాయితీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్లు ప్రభావం చూపించారు. కాగా..
పంచాయితీ ఎన్నికల్లో కూటమిగా ఎంవీఏకు దాదాపు 60 శాతం సీట్లు దక్కడం అద్భుతమైన విషయమని, ఇది భారీ విజయమని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, మూడు పార్టీలూ ఏకమైనప్పటికీ, బీజేపీ ఒంటరిగా పోరాడి సింగిల్ లార్జెస్ట్ పార్టీలా అవతరించిందని, పంచాయితీ ఎన్నికల్లో అసలైన గెలుపు తమదేనని బీజేపీ నేతలు క్లెయిమ్ చేసుకున్నారు. మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయానికి వెలువడనున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications