వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. వైద్య మంత్రికి పాజిటివ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. దీంతో జనాలు బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేశారు. అదే సమయంలో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కూడా కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. వైద్యులను సంప్రదించానని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. మీ అందరీ ఆశీస్సులతో త్వరలో తిరిగి వచ్చి సేవ చేస్తానని చెప్పారు.

గత కొద్దిరోజులగా తనతో ఇంటరాక్ట్ అయినవారు కూడా కరోనా పరీక్ష చేసుకోవాలని రాజేశ్ కోరారు. లక్షణాలు కనిపించిన వారు తప్పకుండా పరీక్ష చేసుకోవాలని స్పష్టంచేశారు. గత కొద్దీ రోజుల నుంచి మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా 5427 పాజిటివ్ కేసులు రాగా.. 38 మంది చనిపోయారు. వైరస్ తగ్గి 2543 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 40 వేల 858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2.48గా ఉంది.

 Maharashtra Health Minister Rajesh Tope tests Covid positive

కరోనా కేసులు పెరగడంతో అమరావతి, యవత్మాల్ జిల్లాల్లో కోవిడ్-19 నిబంధనలను అమలు చేశారు. శనివారం నుంచి అమరావతిలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా కేసులు పెరగడంతో బీఎంసీ కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది.

English summary
Maharashtra Health Minister Rajesh Tope took to Twitter late Thursday to inform that he has tested positive for the novel coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X