Maharashtra - Jharkhand Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు: మరికొద్ది గంటల్లో ఉత్కంఠ..!

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వీటితోపాటు నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా శనివారమే జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా 288 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు 288 మంది పరిశీలకులను ఈసీ నియమించింది.

శనివారం ఉదయం 8 గంటలకు కౌటింగ్‌ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు లెక్కించి తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని చేయాల్సి ఉంది. కాగా, కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలు సీసీటీవీ నిఘాలో ఉన్నాయని, వాటి ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరవనున్నట్లు చెప్పారు. ముంబైలో 36 కౌంటింగ్‌ కేంద్రాలకు 300 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. నవంబర్‌ 24 అర్ధరాత్రి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.

Maharashtra Jharkhand assembly election results today

మహారాష్ట్రలో నవంబర్‌ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెుత్తం 66.05 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన ఏక్‌నాథ్ షిండే పార్టీ 81, ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని కాంగ్రెస్‌ 101, శివసేన-యూబీటీ 95, ఎన్​సీపీ-ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది.

జార్ఖండ్ ఫలితాలు కూడా నేడే

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా శనివారం వెలువడనున్నాయి. ఎన్​డీఏ, ఇండియా కూటముల మధ్య నెలకొన్న ద్విముఖ పోరులో ఎవరిని విజయం వరిస్తుందో మరికొద్ది గంటల్లో తెలిపోనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలో అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి.. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన పోరు నెలకొంది.

2000 సంవత్సరం నవంబర్‌ 15న జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల వరకు చూసుకుంటే, ఈసారే ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారు. రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. 9 గంటల తర్వాత నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉందన్నారు.

జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, ఇటీవల వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశముందని అంచనా వేశాయి. జేఎంఎం నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ మాత్రం తాము అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఏదైనా నేటి సాయంత్రంలోపు తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+