వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలపై నిద్రించిన వలస కార్మికులపై దూసుకెళ్లిన గూడ్స్ బండి: 15 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు ఢీ కొని పలువురు వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 15 మంది మరణించినట్లు తొలుత రైల్వే భద్రతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. పట్టాల వెంట స్వగ్రామానికి కాలి నడకన తిరుగు ప్రయాణమైన వలస కార్మికులు పట్టాల మీదే నిద్రించిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Recommended Video

Aurangabad : Goods Train Runs Over Chhattisgarh Labourers In Maharashtra

తెలంగాణలో మాస్క్ లేకుండా అడుగు బయట పెడితే.. జేబులు గుళ్లే: ఆ జోన్లలో ప్రైవేటు సంస్థలు ఓపెన్తెలంగాణలో మాస్క్ లేకుండా అడుగు బయట పెడితే.. జేబులు గుళ్లే: ఆ జోన్లలో ప్రైవేటు సంస్థలు ఓపెన్

కర్మద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన

కర్మద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన

మహారాష్ట్రలోని ఔరంగాబాద్-జాల్నా రైల్వే లైన్ మధ్య కర్మద్ స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన సంభవించింది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే రైల్వే భద్రతా జవాన్లు, కర్మద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు.

పట్టాలపైనే నిద్ర..

పట్టాలపైనే నిద్ర..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన లక్షలాది మంది వలస కార్మికులు.. కాలి నడకన తమ స్వస్థలాలకు చేరుకుంటోన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ముంబై సహా ప్రధాన నగరాల్లో భవన నిర్మాణ కార్మికులు, దినసరి వేతన కూలీలు.. భార్యా బిడ్డలతో స్వస్థలానికి బయలుదేరారు. ఔరంగాబాద్-జాల్నా స్టేషన్ల మధ్య వారంతా రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా చీకటి పడటంతో కర్మద్ రైల్వే స్టేషన్ సమీపంలో వారు పట్టాల మీదే నిద్రించారు.

 గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో..

గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో..

అదే సమయంలో ఔరంగాబాద్ నుంచి జాల్నా వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు వారి మీది నుంచి దూసుకెళ్లింది. ఫలితంగా 15 మంది వలస కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే కర్మద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

నుజ్జునుజ్జయిన మృతదేహాలు..

నుజ్జునుజ్జయిన మృతదేహాలు..

గూడ్స్ రైలు కింద పడి నలిగిన మృతదేహాలతో సంఘటనా స్థలం భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయని, చేతులు, కాళ్లు విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయిందా ప్రదేశం. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చుట్టు పక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

English summary
At least 15 people, most of them migrant workers, including some kids, were crushed to death by a train in Aurangabad, Maharashtra, on Friday morning. The accident happened on the Aurangabad-Jalna railway line under the limits of Karmad police station. According to preliminary information, the labourers, were sleeping on the track when they were run over by a goods train that was running between Jalna and Aurangabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X