వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కరువు’తో సెల్ఫీనా?: మంత్రి పంకజపై విమర్శలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి పంకజా ముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. కరువుతో అల్లాడుతున్న లాతూరు జిల్లాలో ఆదివారం సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లాతూరు జిల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆమె పూర్తిగా ఎండిపోయిన మంజీరా నది పునరుద్ధరణకు సియా గ్రామం వద్ద ప్రభుత్వం చేపట్టిన పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా నది ఒడ్డున నిలబడి తన సెల్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అంతేగాక, ఆ సెల్ఫీని ట్విటర్ పోస్ట్ చేశారు. కాగా, ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 Maharashtra minister Pankaja Munde faces flak over 'drought selfie'

కరువు ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటారా? అంటూ మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన ఆమె పనుల పర్యవేక్షణకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

మంజీరా నది పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. పంకజ సెల్ఫీపై మిత్రపక్షం శివసేన స్పందించింది. కరువు ప్రాంతం లాతూరులో సెల్ఫీ తీసుకోవడం దురదృష్టకరమని, ఇలా చేసుండాల్సింది కాదని పేర్కొంది.

English summary
Maharashtra Minister for Water Conservation Pankaja Munde landed in trouble after she took selfies in drought-hit Latur district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X