జాతీయ క్రీడలు: స్టేడియంలో కుప్పకూలిన క్రీడాకారుడు, మృతి
తిరువనంతపురం: కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 21ఏళ్ల నెట్ బాల్ ఆటగాడు గుండెపోటుతో మృతి చెందాడు. శిక్షణ పొందుతున్న సమయంలోనే మయురిష్ పవార్ అనే క్రీడాకారుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని జాతీయ క్రీడల సెక్రటేరియట్ అధికారులు చెప్పారు.

‘వెల్లయానిలోని ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం అతని గదికి వెళుతుండగా ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతనితోపాటు ఉన్న ఇతర సభ్యులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు' అని అధికారులు తెలిపారు.
అతని మృతదేహాన్ని అతని టీంకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications