94 ఐఎస్ ప్రభావిత వెబ్‌సైట్‌ల నిలిపివేత
పుణె: దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల్లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా యువతను ప్రేరేపిస్తున్న 94 ఇంటర్నెట్ వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వెల్లడించింది.
మహారాష్ట్రతో పాటు దేశంలోని 10 నుంచి 12 రాష్ట్రాల్లో ఐఎస్ ప్రభావం ఉందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) అధినేత వివేక్ ఫన్‌సల్కర్ ఆదివారమిక్కడ తెలిపారు. అంతర్జాల సాధనంతోనే ఐఎస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఐఎస్‌ఐఎస్ వలలో పడకుండా యువతలో చైతన్యం తెచ్చేందుకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించనున్నామని, తద్వారా ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు.
మలేషియాలోని కీలకమైన ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు కుట్రపన్నిన ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరికి జకర్తాలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదితో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.












Click it and Unblock the Notifications