వారిస్ పంజాబ్ దే అమృత్‌పాల్ సింగ్ ఎంట్రీ పై మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం

ముంబై: వారిస్ పంజాద్ దే అధిపతి అమృత్ పాల్ సింగ్‌ పరారైన నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అమృత్ పాల్ సింగ్ మహారాష్ట్రలో ప్రవేశించాడనే సమాచారం రావడంతో నాందేడ్ పోలీసులు రంగంలోకి దిగారు. నాందేడ్‌కు వచ్చే, వెళ్లే ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర ఏటీఎస్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ఇటీవల అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, వాహనాలు, వేశాలు మారుస్తూ అమృత్ పాల్ సింగ్‌ వారి కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అమృత్ పాల్ సింగ్‌ అనుచరులను కొంతమందిని పోలీసులు అరెస్ట్ విచారిస్తున్నారు.

Maharashtra Police on Alert over Waris Punjab Des Amritpal Singh

అమృత్ పాల్ సింగ్‌ కోసం ఉధృతంగా గాలిస్తున్నారు. అతడు దేశం విడిచిపెట్టాడా? లేక వేరే రాష్ట్రాలకు వెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, ఖలిస్థాన్ మద్దతుదారులు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ లోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు.

ఇది ఇలావుంటే, అమృత్ పాల్ సింగ్ కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ ను పంజాబ్ విపక్ష పార్టీ అకాలీదళ్ తప్పుబట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చట్టవిరుద్ధమైన ఈ ఆపరేషన్లో అరెస్టైన పంజాబీ యువతకు తాము న్యాయసాయం అందజేస్తామని అకాలీదల్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. సిక్కుల ఆధ్యాత్మిక నాయకులతో ఏర్పాటైన కమిటీ ఈ మేరకు ఓ హెల్ప్ లైన్ నెంబర్ కూడా విడుదల చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+