మహారాష్ట్ర: భాజపా-శివసేన మధ్య పొత్తు పొడిచింది
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎన్నికల్లో భాజపా - శివసేన కూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. శివసేన అనుకున్నట్లుగానే 151 స్దానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 130 స్దానాలు, ఆయా కూటమి పార్టీలకు ముందుగా 18 సీట్లు అనుకున్నా కేవలం 7 స్దానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
సీట్ల సర్దుబాటు, ఎన్నికల పొత్తు కొనసాగించడానికి ఇరు పార్టీల నేతలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. దీనిపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సీట్ల సర్దుబాటుపై భాజపా - శివసేన పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న స్తబ్దతకు తెరపడింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ స్దానాల సంఖ్య 288.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.

నోటిఫికేషన్ జారీ:
ఈనెల 27వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
అక్టోబర్ 15వ తేదీన పోలింగ్
అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications