మహారాష్ట్ర: మహాయుతి, ఇండి కూటమికి రెబల్స్ దెబ్బ, బీజేపీ నుంచే అధికం
నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు రెబల్స్ షాకిస్తున్నారు. అధికార మహాయుతికి చెందిన దాదాపు 50 మంది తిరుగుబాటు అభ్యర్థులు, అలాగే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA)కి చెందిన రెబల్స్ పోటీలో ఉన్నారు. రెబల్స్ నామినేషన్లను వెనక్కి తీసుకునేలా రెండు కూటములు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.
ఈ తిరుగుబాటుదారులలో, 26 మంది మహాయుతికి చెందినవారు ఉండగా, ఇండియా కూటమి నుంచి 18 మంది రెబల్స్ ఉన్నారు. బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిలి మహాయుతి కూటమిగా ఉండగా. కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన కలిసి మహా వికాస్ కూటమిగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

పలు రాష్ట్రాల్లో రెబల్స్ కారణంగా పార్టీల విజయావకాశాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా, 13 మంది బీజేపీ రెబల్స్.. ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీలకు వ్యతిరేకంగా బరిలో దిగుతున్నారు. 12 మంది షిండే పార్టీ రెబల్స్ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ నుంచి ఒకరు రెబల్ గా పోటీలో ఉంటున్నారు. సమీర్ భుజ్‌బల్ తాజాగా ఆ పార్టీని వీడారు. మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి కూడా 18 మంది రెబల్స్ బరిలో దిగుతుండటం గమనార్హం.
రెబల్స్ పోటీ ఎలా ఉందంటే..?
మహాయుతి తిరుగుబాటుదారులు - 26
బీజేపీకి వ్యతిరేకంగా సేన తిరుగుబాటు - 7
ఎన్సీపీపై సేన తిరుగుబాటు - 5
సేనపై బీజేపీ తిరుగుబాటు - 6
ఎన్సీపీపై బీజేపీ తిరుగుబాటు - 7
సేనపై ఎన్సీపీ తిరుగుబాటుదారులు - 1
స్నేహపూర్వక పోరాటాలు - 2
సేన vs NCP - 2
MVA తిరుగుబాటుదారులు - 8
సేన (యుబిటి)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తిరుగుబాటుదారులు - 4
NCP (SP)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తిరుగుబాటుదారులు - 1
NCP (SP)కి వ్యతిరేకంగా సేన (UBT) తిరుగుబాటు - 2
సేన (UBT)కి వ్యతిరేకంగా NCP (SP) తిరుగుబాటు -1
MVA అంతర్గత తిరుగుబాటుదారులు - 10
సేన (UBT) -1
NCP - 3
కాంగ్రెస్ - 6
స్నేహపూర్వక పోటీలు - 4.
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ నుంచి 152 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. షిండే శివసేన నుంచి 78 మంది అభ్యర్థులు, ఎన్సీపీ నుంచి 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు, మహా వికాస్ అఘాడీలో 104 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి 94 మంది, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి 87 మంది పోటీలో దిగుతున్నారు.












Click it and Unblock the Notifications