మహారాష్ట్రలో మళ్లీ పెరిగిన కరోనా -కొత్తగా 66,358 కేసులు, 895 మరణాలు

కరోనా వైరస్ ఉధృతి అతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో రోజువారీ కొత్త కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా దాదాపు రెండింతలు పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో కొత్తగా 66,358 పాజిటివ్ కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. సోమవారం కొత్త కేసులు సంఖ్య 48,700, మరణాల సంఖ్య 524గా ఉన్నప్పటికీ 24 గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

తాజా గణాంకాలతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసులు 44,10,085కు, మొత్తం మరణాలు 66,179కి పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 67,752మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 36.69లక్షలకు పెరిగింది.

Maharashtra reports 895 Covid-19 deaths, 66,358 new cases

మహారాష్ట్రలో రికవరీ రేటు 83.21 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుం రాష్ట్రంలో 6,72,434 యాక్టివ్ కేసులు ఉండగా, 2,64,936మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, మరో 30,146 మంది పేషెంట్లు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+