మహారాష్ట్రకు పాకింది: ఫస్ట్ జికా వైరస్ కేసు.. రాష్ట్రంలో ఎక్కడ అంటే..

కరోనా వైరస్‌తోనే తల్లడిల్లుతోన్న పరిస్థితి.. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. ఇదిలా ఉండగా జికా వైరస్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ వచ్చింది. పుణె జిల్లా పురందర్ తహసీల్ పరిధిలో మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు.

Recommended Video

    Zika Virus : Karnataka Issues Guidelines To Prevent Zika Virus | Kerala | Oneindia Telugu

    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ )జులై 30వ తేదీన ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది. జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు అని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవాతె అంటున్నారు. కుటుంబంలో గల ముగ్గురికి పరీక్షలు జరిపాం అని.. ఒక కూతురికి చికెన్ గున్యా జ్వరం, మరొకరైన కొడుకుకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవని చెప్పారు. అందరూ క్షేమంగా ఉన్నారని అవాతె వివరించారు.

    Maharashtra reports first case of Zika virus

    ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయని తెలిపారు. జులై 15 నుంచి ఆమెలో జికా వైరస్ లక్షణాలు కనిపిస్తుండగా, జులై 30నుంచి చికెన్ గున్యా కూడా సోకిందని తెలిపారు. గ్రామంలో జ్వరంతో ఉన్న వారు బెల్సార్‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు జులై 16 నుంచి ఐదుగురు శాంపుల్స్ పంపించగా.. ముగ్గురికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. నిపుణులు చెప్పిన దానిని బట్టి జికా వైరస్ ఇన్ఫెక్షన్ దోమ కుట్టిన 14రోజుల తర్వాత బయటపడుతుంది.

    జికా ఇన్ఫెక్షన్ గురించి ఆందోళన పడొద్దని జిల్లా అడ్మినిష్ట్రేన్ చెబుతుంది. 'క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నాం. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తాం' అని జిల్లా అధికారి ఒకరు అన్నారు. దేశంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న.. మరణాలు సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+