వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా మరో రికార్డు: ఒక్కరోజులో 36వేలకుపైగా కొత్త కేసులు, సెంచరీ దాటిన మరణాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభణ మరింతగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 28 రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. కాగా, శుక్రవారం కరోనా కేసులు మరో రికార్డును సృష్టించాయి.

శుక్రవారం 36,902 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 112 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మరణాల రేటు 2.04శాతానికి పెరిగింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 14,29,998 మంది హోం క్వారంటైన్లో ఉండగా, 14,578 మంది ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు.

Maharashtra state reports 36,902 fresh Covid-19 cases

ప్రస్తుతం రాష్ట్రంలో 2,82,451 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇది 60 శాతానికి మించి కావడం గమనార్హం. ఇక ముంబైలోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఇక్కడి 5513 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కట్టడి చర్యలపై డివిజన్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్పీలతోపాటు వైద్యాధికారులతో శుక్రవారం సీఎం ఉద్ధవ్ థాక్రే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ విధించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అయితే, ప్రజలు ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.

కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్ మూసివేయాలని ఆదేశించారు. ఈ కర్ఫ్యూ రాత్రిపూట రాకపోకలపై ప్రభావం ఉండబోదని, అయితే, ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

English summary
Maharashtra state reports 36,902 fresh Covid-19 cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X