రేపు, ఎల్లుండి స్కూల్స్‌ కు సెలవు.. ఎందుకో తెలుసా..?

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు బిగ్ అలర్ట్‌. రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవులు వచ్చాయి. పిల్లలు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. లేదంటే అటు పేరెంట్స్, ఇటు పిల్లల టైమ్ వృథా అవుతుంది. ఒకటి కాదు ఏకంగా రెండు రోజులు పాటు స్కూళ్లకు సెలవులు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సెలవులు ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు మహారాష్ట్రలో వచ్చాయి. అయితే ఇవి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవులు కావు. కానీ ఈ రెండు రోజులు పాఠశాలలు తెరుచుకోవు. ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కారు. దీంతో ఈ రెండు రోజులు సెలవులుగా పరిగణించవచ్చు. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.

Maharashtra Teachers Strike Statewide School Bandh on July 7 and 8

ఈ మేరకు జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు పలు నిరసనలు, బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం, మంగళవారం రెండు రోజులు పాఠశాలలకు హాజరుకావడం లేదని ప్రకటించారు. వీళ్లతో పాటు బోధనేతర సిబ్బంది, వంట సిబ్బంది, ప్యూన్ సహా మిగతా ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు వచ్చినట్లుగా భావించవచ్చు.

మరోవైపు ఉపాధ్యాయుల నిర్ణయంతో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. పిల్లలు విద్య కోల్పోతారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆదివారం ఒక రోజు సెలవు.. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల సెలవులు రావడంతో విద్యార్థులు చాలా కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులతోపాటు పలువురు సామాజిక వేత్తలు కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+