
festival: అలర్ట్, కేసులు పెరగొచ్చు.. గైడ్ లైన్స్ ఇవే
ఇప్పటివరకైతే కరోనా ఊసు లేదు. దేశవ్యాప్తంగా కూడా 2, 3 వేల లోపు కేసులు వస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అని.. పండగ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఒకడుగు ముందుకేసి.. దీపావళి పండగ సందర్భంగా పలు మార్గదర్శకాలను రూపొందించింది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

ఈ వారంలో మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరిగింది. 17.7 శాతం ఎక్కువ కేసులు వచ్చాయి. ఎక్స్‌బీబీ వేరియంట్ కేసు రావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదీ బీఏ 2.75 కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. రోగనిరోధక శక్తిపై దాడి చేస్తోందని చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ సింగపూర్‌లో బయటపడింది. తర్వాత వేగంగా కేసులు వచ్చాయి.
మహారాష్ట్రలో ఇతర కోవిడ్ వేరియంట్స్ కూడా వచ్చాయి. బీఏ 2.3.20, బీక్యూ 1కేసులు కూడ వచ్చాయి. ఈ క్రమంలో మార్గదర్శకాలను జారీచేసింది. జలుబు సంబంధింత సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని తెలిపింది. వెంటనే సంబంధిత వైద్యుడిని కలవాలని కోరింది. పబ్లిక్ ప్లేసులలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. జీవోఐ గైడ్ లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ చేపట్టాలి. ప్రజలు గుమిగూడే ప్రాంతాలకు వెళ్లిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. జలుబు ఉన్న క్యాండెట్.. బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని కోరుతున్నారు.