భర్త చనిపోయాడు... ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుంది.. అత్తింటి ఆగ్రహానికి బలి...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. తమ కోడలు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న కారణంతో... ఆమెతో పాటు ఆమె ప్రియుడిని అత్తింటి కుటుంబం కిరాతకంగా హత్య చేసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపించింది. భర్త చనిపోవడంతో ఆమె మరో వ్యక్తికి దగ్గరవగా... దాన్ని జీర్ణించుకోలేని అత్తింటివారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని చపల్‌గావ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఘన్‌సవంగి తహశీల్ పరిధిలోని చపల్‌గావ్‌కి చెందిన మరియా అనే మహిళ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి ఆమె అత్తింటివారితోనే ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన హర్బక్ భగవత్(27) అనే వివాహితుడితో మరియాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యంగా ఏర్పడింది. అలా చాలాకాలంగా మరియా-భగవాన్ తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

పారిపోయిన మరియా-భగవత్...

పారిపోయిన మరియా-భగవత్...

మరియా మామ బాత్వెల్ లాల్‌జరే,ఆమె మరిది వికాస్ లాల్‌జరేలకు ఈ విషయం తెలియడంతో ఆమెపై కన్నెర్ర చేశారు. మరియాతో సంబంధాన్ని తెంచుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భగవాన్‌‌ను హెచ్చరించారు. దీంతో తన ప్రాణానికి లాల్‌జరే ఫ్యామిలీ నుంచి ముప్పు ఉందని భగవాన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది మార్చి 30న భగవత్,మరియా గ్రామం నుంచి పారిపోయి గుజరాత్‌కు చేరుకున్నారు. దీంతో మరియాపై ఆమె అత్తింటివారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ట్రాక్టర్‌తో ఢీకొట్టి...

ట్రాక్టర్‌తో ఢీకొట్టి...

పోలీసులు మరియా-భగవాన్‌ల ఆచూకీ తెలుసుకుని... ఏప్రిల్ 22న వారిని గ్రామానికి రప్పించారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దీంతో మరియా అత్తింటివారు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. తమ కళ్ల ముందే ఇద్దరు కలిసి జీవించడాన్ని తట్టుకోలేకపోయారు. అక్టోబర్ 28న మరియా,భగవత్... బైక్‌పై సమీప పట్టణంలోని ఓ కార్యక్రమానికి వెళ్తుండగా... వికాస్ లాల్‌జరే వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. ట్రాక్టర్ చక్రాలను వారిపై ఎక్కించడంతో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

Recommended Video

    Kangana Ranaut : ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు! - కంగనా రనౌత్ || Oneindia Telugu
    కేసు నమోదు... నిందితుడి అరెస్ట్...

    కేసు నమోదు... నిందితుడి అరెస్ట్...

    మరియా,భగవాన్ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన భర్తను,మరియాను వికాస్ లాల్‌జరే హత్య చేశాడని ఆరోపిస్తూ భగవత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వికాస్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని.. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ నందేకర్ తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+