కి'లేడీ' బాగోతం.. ఇప్పటికే 8 పెళ్లిళ్లు ఫినిష్.. తొమ్మిదో మ్యారేజ్‌లో షాకింగ్ ట్విస్ట్ !
నిత్య పెళ్లికొడుకు.. వ్యవహారాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను ఎన్నో చూసుంటాం. కానీ ఎప్పుడు అబ్బాయి లేనా మేము మాత్రం తక్కువ కాదు అంటూ ఈ దందాకు తెరలేపింది ఓ కిలేడీ. ఇప్పటివరకు ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడింది.
పెళ్లికాని ధనవంతులనే టార్గెట్ చేసి.. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని.. ఓ ఎమోషనల్ డ్రామాతో వారిని బుట్టలో వేసుకొని.. పెళ్లి తర్వాత భర్తను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బలవంతంగా డబ్బు వసూలు చేసేలా ఓ టీమ్ ని కూడా సెట్ చేసింది. ఓ బాధితుడు.. తన నుంచి రూ.50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.

ఎవరామే..
ఈ మోసానికి పాల్పడింది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు అయిన ఈమె.. గత 15 ఏళ్లుగా పెళ్లి పేరుతో ఎందరినో బురిడీ కొట్టించింది. ఆ లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు.. రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారి సైతం ఉండడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
ఎలా ప్లాన్ చేసేదంటే..?
ముందుగా డబ్బున్న, పెళ్లికాని పురుషుల వివరాలను.. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా సేకరించి స్నేహం పెంచుకుంటుంది. ఆ తర్వాత తాను విడాకుల తీసుకున్నానని.. ఒక చిన్నపిల్లను చూసుకుంటున్నానని ఎమోషనల్ స్టోరీ చెబుతుంది. వివాహం అయిన అనంతరం కొంతకాలం బాగున్నట్టు నటిస్తుంది. చివరగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేస్తుంది.

ఎలా అరెస్ట్ చేశారంటే..?
జూలై 29న నాగ్‌పూర్‌లోని ఓ టీ దుకాణం వద్ద 9వ భర్తను కలవడానికి వచ్చిన సందర్భంలో.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆమెకు సహకరించే ముఠాలోని ఇతర సభ్యుల వివరాల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications