వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జింతాపై అసభ్యంగా వాడియా: పోలీసులతో కమిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై ప్రీతీ జింతా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర మహిళా కమిషన్ బృందం శనివారం ఉదయం మెరైన్ డ్రైవ్ పోలీసు అధికారులను కలిసింది. కమిషన్ చైర్‌పర్సన్ చిత్రా వా నేతృత్వంలో ఆ బృందం కలిసింది.

ప్రీతి జింతా చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి వాకబు చేయడానికి ఆ బృందం పోలీసు అధికారులను కలిసింది. ప్రీతి జింతా మెరైన్ డ్రైవ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మే 30వ తేదీన నెస్ వాడియా తన శరీరంలో తాకగూడని చోట్ల తాకాడని ఆమె ఆరోపించారు.

Maharashtra women's commission meets cops over Zinta molestation case

వాంఖడే స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తనను దూషించాడని ఆమె ఆరోపించారు. నెస్ వాడియా, ప్రీతి జింతా ఐపియల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమానులు. ప్రీతి జింతా ఫిర్యాదు చేసి 24 గంటలు దాటిపోతోందని, ఆమె ఫిర్యాదు తీసుకున్న చర్యలేమిటనేది తెలుసుకోవడానికి తాము వచ్చామని వా ఓ ప్రముఖ దినపత్రిక ప్రతినిధితో చెప్పారు.

సిసిటివి ఫుటేజ్‌లు తమ వద్దకు చేరాయని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నామని పోలీసులు చెప్పినట్లు ఆమె తెలిపారు. అది పూర్తయిన తర్వాత వాడియాను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె చెప్పారు.

English summary

 A five-member delegation of Maharashtra Women's Commission led by its chairperson, Chitra Wagh, on Saturday morning met the Marine Drive police officials to find out the action taken against industrialist Ness Wadia in a molestation complaint registered by actor Preity Zinta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X