Maharastra : ప్రజల్లోకి మహారాష్ట్ర విపక్షాలు-ఉద్ధవ్, పవార్ తోడుగా-బీజేపీ తీరు ఎండగట్టేలా..
గతంలో ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రామ్ లాల్ సాయంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూల్చివేసినప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే తరహాలో మహారాష్ట్రలో విపక్షాలు కూడా తమకు ప్రజలు ఇచ్చిన విజయాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి.
మహారాష్ట్రలో ముందు శివసేనను, ఆ తర్వాత తాజాగా ఎన్సీపీని చీల్చి తమ ప్రభుత్వానికి మద్దతుగా ఫిరాయించేలా ప్రోత్సహించిన బీజేపీ తీరును ఎండగట్టేందుకు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ లకు షాకిస్తూ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించింది. దీంతో వీరిద్దరిని కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఓ యాత్ర నిర్వహిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ నానా పటోలే ప్రకటించారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ విపక్షాలను చీల్చడం, దారిలోకి రాని విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులు బనాయించి బెదిరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో త్వరలో ఈ మేరకు రాష్ట్రవ్యాప్త యాత్రకు ప్లాన్ చేస్తోంది. ఇందులో మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలంతా పాల్గొనేలా వ్యూహరచన చేస్తున్నారు.
వచ్చే ఏడాది మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ యాత్ర అన్నివిధాలుగా తమకు పనికొస్తుందని విపక్ష కూటమి భావిస్తోంది. ఎలాగో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారంగానూ ఈ టూర్ విపక్షాలకు ఉపయోగపడనుంది. ఈ టూర్ తర్వాత ప్రజల్లో తమకు సానుభూతి వచ్చే అవకాశముంటుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.దీంతో విపక్షాల యాత్ర వ్యూహం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications