MH Elections: కాంగ్రెస్, ఉద్ధవ్ సేన మధ్య సీట్ల చిచ్చు-అసలు కారణాలివే..?
మహారాష్ట్రలో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిపై విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. దీంతో అధికార కూటమి ఆత్మరక్షణలో పడింది. అయితే తిరిగి మహావికాస్ అఘాడీ కూటమిలో నెలకొన్న పోరు చూస్తే బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లవుతోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు నెలరోజుల సమయం కూడా లేదు. వచ్చే నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే సీట్ల పంపకాలపై మాత్రం మహా వికాస్ అఘాఢీలో ప్రతిష్టంభన మాత్రం వీడటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్-ఉద్ధవ్ థాక్రే శివసేన మధ్య సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని తొలగించడానికి రెండు పార్టీలు ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ ను ఆశ్రయించాయి. అయితే వీరి చర్చల్లో ప్రతిష్టంభన వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 13 ఎంపీ సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహా వికాస్ అఘాడీ సీట్లలోనూ పెద్దన్న పాత్ర కోరుకుంటోంది. కానీ కాంగ్రెస్ కు ఆధిపత్యం ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఉద్ధవ్ థాక్రే భయపడుతున్నారు. దీంతో థాక్రే చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. థాక్రే తమకు, కాంగ్రెస్ కు వందేసి సీట్ల చొప్పున తీసుకుని ఎన్సీపీకి 88 ఇద్దామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం 125 సీట్లు అడుగుతోంది.
అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్న రామ్‌టెక్, ధమన్‌గావ్ రైల్వే. లేదా 2019లో ఎక్కడ గెలిచిన చంద్రపూర్‌లోని వరోరా, అమరావతిలోని దర్యాపూర్, బాంద్రా ఈస్ట్, నాగ్‌పూర్ సౌత్ వంటి స్ధానాలు ఇవ్వాలని థాక్రే అడుగుతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో తాముు త్యాగాలు చేశామని థాక్రే చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం శివసేనలో బలమైన అభ్యర్ధులు లేరంటోంది.












Click it and Unblock the Notifications