ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..!

అమెరికాతో ఆరు వారాల పాటు సాగిన ఇరాన్ వార్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధం ఎట్టకేలకు ఆగింది. ఈ ఆరు వారాల్లో ఇరాన్ ను తక్కువ అంచనా వేసిన అమెరికా-ఇజ్రాయెల్ కు చుక్కలు కనిపించాయి. దీంతో పదే పదే ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్ ను బెదిరించిన ట్రంప్.. చివరికి కాల్పుల రెండు వారాల విరమణను ప్రకటించారు. ఈ సందర్భంగా యుద్ధంలో ఇరాన్ పోరాడిన తీరు ప్రపంచ దేశాల్ని ఆకట్టుకుంది.

ఇదే క్రమంలో ఇరాన్ కు సహజమిత్రదేశమైన భారత్ కూడా ఈ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాలనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చౌకైన షాహెద్ డ్రోన్లతో అమెరికా యుద్ద విమానాలను నేలకూల్చిన ఇరాన్ యుద్ధ తంత్రం ఇప్పుడు భారత్ సహా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో కేంద్రం కూడా ఇప్పటికే డ్రోన్ల అప్ గ్రేడ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అమెరికా వంటి అగ్రదేశంపై ఇరాన్ పోరాడిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశంసల జల్లు కురిపించారు.

Mahua Moitra Iran s Courage Should Inspire India to Set Own Deals Policies and Ceasefires

ధైర్యం, వెన్నెముక ఉండటం అంటే ఏమిటో ఇరాన్ ప్రపంచానికి నేర్పిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. బహుశా ఇప్పుడు మన నాయకత్వం కూడా దౌర్జన్యపరులను దృఢంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు. భారతదేశం మన స్వంత కాల్పుల విరమణలను, వాణిజ్య ఒప్పందాలను, ఇంధన విధానాలను ప్రకటించాలని మొయిత్రా సూచించారు. గతంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణ సందర్భంగా ట్రంప్ జోక్యం చర్చనీయాంశమైన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+