బంధువులకు దూరం: మంత్రులకు మోడీ మంత్రం
న్యూఢిల్లీ: అధికారిక కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు ఆమడ దూరంలో ఉంచే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులకు ఉపదేశం చేశారు. మంత్రులను తన బాటలో నడవాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు, తమ వారి పట్ల పక్షపాతం చూపిస్తున్నామనే విమర్శలకు అవకాశమివ్వకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ మేరకు మంత్రులందరికీ 4 మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులను, బంధువులను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకోవద్దని సూచించారు. బంధుప్రీతిని తగ్గించుకోవాలి, బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వొద్దని చెప్పారు.

ప్రజా సంబంధ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని నాలుగో మార్గదర్శకంగా సూచించారు. ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను ప్రాధాన్య క్రమంలో పరిశీలిస్తామని పీఎంవో కార్యాలయ అధికారులతో తొలిసారి నిర్వహించిన సమావేశంలో మోడీ తెలిపారు.
నరేంద్ర మోడీ వస్తూనే తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications