స్టాలిన్, మమతకు ఈసీ భారీ షాకులు- సర్వే జోస్యాల వేళ సంచలన నిర్ణయాలు..!
ఈ నెల 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఈ రెండు రాష్ట్రాలకు ఈసీ (EC) వరుస షాకులిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల విషయంలో పలు సర్వే సంస్థలు వెలువరిస్తున్న ఫలితాల వేళ ఈసీ (election commission) నిర్ణయాలు సంచలనంగా మారాయి. అలాగే ఆయా రాష్టాల్లో అధికార పార్టీలైన డీఎంకే, టీఎంసీకి షాకులిస్తున్నాయి.
తమిళనాడు (tamil Nadu) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగనందాన్ని ఎన్నికల సంఘం ఇవాళ తప్పించింది. ఆయన స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.సాయి కుమార్‌ను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే సీనియర్ అధికారి డేవిడ్సన్ దేవసిర్వతంపై వేటు వేసి ఆయన స్ధానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్‌ను విజిలెన్స్,అవినీతి నిరోధక డైరెక్టరేట్ (డీవీఏసీ), సాయుధ పోలీసుల బాస్ గా నియమించింది. ఈ నియామకాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బదిలీ అయిన అధికారులను ఎన్నికలకు సంబంధించిన ఏ పోస్టులలోనూ నియమించకూడదని కూడా స్పష్టం చేసింది.

మరోవైపు పశ్చిమబెంగాల్ లో అధికార టీఎంసీకి ఇవాళ బహిరంగంగా ఎన్నికల సంఘం అల్టిమేటం జారీ చేసింది. ఎక్స్ లో చేసిన పోస్టులో ఈసీ.. ఈసారి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు: నిర్భయంగా, శాంతియుతంగా, బెదిరింపులు లేకుండా, ప్రలోభాలు లేకుండా, దాడులు లేకుండా, బూత్ మరియు సోర్స్ జామింగ్ లేకుండా ఖచ్చితంగా జరుగుతాయని తెలిపింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హెచ్చరికల రూపంలో చెప్పడం వివాదాస్పదంగా మారుతోంది. అంతకు ముందే ఢిల్లీలో ఈసీని కలిసిన టీఎంసీ ఎంపీల బృందాన్ని ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ఐదు నిమిషాల్లోనే గెట్ అవుట్ అంటూ తరిమేశారంటూ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications