వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: మేరా భారత్ మహాన్ -త్రివర్ణ వెలుగులో ప్రఖ్యాత కట్టడాలు -Independence Day 2021 స్పెషల్

|
Google Oneindia TeluguNews

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ లో వేడుకలు ముందస్తుగానే ఆరంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా అన్ని ప్రధాన నగరాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. చారిత్రక, ప్రఖ్యాత కట్టడాలు, మార్గాలు, ప్రాంతాలు మూడు రంగుల్లో వెలిగిపోతున్నాయి. దేశ ప్రజలంతా ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా బడులన్నీ మూసి ఉంచిన నేపథ్యంలో చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితం కానున్నారు. కాలేజీలు, వర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుగనున్నాయి. రైతుల నిరసనలు, ఉగ్రదాడుల అనుమానం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టంచేశారు.

Major landmarks across india bathed with the tricolor lighting amid Independence Day 2021

స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు , భద్రతా సంస్థల సమన్వయంతో నగరం అంతటా అనేక కంపెనీల కమాండోలను మోహరించారు. అడుగడుగునా నాకాబందీ నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని అన్ని రోడ్లు, హైవేలు, ఇతర మార్గాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ లోకి ప్రవేశించే వ్యక్తులందరినీ, వారి వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి చిన్మోయ్ బిస్వాల్ తెలిపారు. సామాజిక వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ఎవరూ రాజధాని నగరంలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగరేసి, ప్రసంగం చేయనున్న ఎర్రకోట వద్ద అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు.

ఎర్రకోట వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ కంటైనర్లను కూడా అడ్డుగా పెట్టి కట్టుదిట్టమైన రక్షణ వలయం ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో మారణాయుధాలు తీవ్ర కలకలం సృష్టించాయి. అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ విధ్వంసానికి తెర తీసినట్టు తెలుస్తోంది. అయితే వారి కుట్రను పోలీసులు ముందే పసిగట్టారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (స్వాతంత్ర్య వేడకలు)ను పురస్కరించుకుని దేశవ్యాప్త 'ఫిట్ ఇండియా ఫ్రీడం రన్'ను కేంద్ర యువజన వ్యవహరాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారంనాడు ప్రారంభించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌ చంద్ నేషనల్ స్టేడియంలో పచ్చజెండా ఊపి ఈ కార్యక్రమం ప్రారంభించారు.

ఆజాదీ కా మహోత్సవ్‌ను గత మార్చిలో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీకి 75 వారాలకు ముందు ప్రారంభించిన ఈ కార్యక్రమం 2023 ఆగస్టు 15 వరకూ కొనసాగుతుందని ప్రధాని ఆ సందర్భంగా చెప్పారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 100వ స్వాతంత్ర్య దినోత్సవం వరకూ ముందుకు సాగుతూనే ఉంటామని, వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని ఏవిధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారో ఆ దిశగా పురోగమిస్తామని అన్నారు.

Recommended Video

Spl Report On Sharmila Party Flag Hoisting || Oneindia Telugu

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు చెందిన‌ వితంతు కూతుళ్ల‌కు కూడా డిపెండెంట్ పెన్ష‌న్‌ ఇవ్వాల‌ని ఇవాళ ఢిల్లీ హైకోర్టు త‌న తీర్పులో తెలిపింది. ఈ నేప‌థ్యంలో కేంద్రానికి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

English summary
Independence Day is no less than a festival. The sentiment of being free from the British subjugation for 75 years allows every single Indian to pour out their emotions of joy and thrill. Like every year, this year too, the streets, buildings, monuments and landmarks in cities across the nation was bedecked with lights and floral decorations that reflected the tricolour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X