ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు - తాజా హెచ్చరిక..!!

ఏపీలో వాతావరణం మారుతోంది. రుతుపవనాల రాకతో తొలకరి ప్రారంభమైంది. రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోనూ రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్ణాటక నుండి కోస్తాంధ్ర తీరం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ జల్లులు పడే వీలుంది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

 'తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు..!!
'తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు..!!
apsdma-issues-alerts-over-heavy-rains-rayalaseema-godavari-districts-for-next-five-days

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

కాగా, ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని సుమారు 56 మండలాల్లో తీవ్రమైన వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భానుడి భగభగలకు తోడు ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటి గణాంకాల ప్రకారం ప్రకాశం జిల్లా కరేడులో గరిష్ఠంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, పోలవరం జిల్లాలో 8, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 2 మండలాలు, కృష్ణా జిల్లాలో 3 మండలాలతో పాటు ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+