అత్త అందానికి అల్లుడు ఫిదా.. ఇద్దరూ కలిసి ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు!

ప్రేమకు వయస్సుతోనే కాదు.. వరుసలతోనూ సంబంధం లేదని నిరూపించారు ఓ అల్లుడు, అత్త. భార్యను కాదని స్వయంగా పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తనే ప్రేమించి పెళ్లాడిన ఓ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్‌లో వెలుగుచూసింది. సమాజం ఏమనుకున్నా పర్వాలేదంటూ వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయి కోర్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అత్తారింటికి వెళ్తూ.. ప్రేమలో పడి..
కాన్పూర్ దేహాత్ పరిధిలోని అక్బర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొత్తలో సాధారణంగానే ఆ యువకుడు తన భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తూ వచ్చేవాడు. అయితే ఆ సమయంలో అత్త అందానికి, ఆమె ప్రవర్తనకు సదరు అల్లుడు పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. వయసులో తమ మధ్య ఎంతో తేడా ఉన్నప్పటికీ.. ఇద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి.. అది కాస్తా కాదనలేని ప్రేమగా మారింది.

Bizarre Wedding Son-in-Law Falls for Mother-in-Law Beauty Marries Her in Court in Uttar Pradesh

ఇళ్లు వదిలి పారిపోయి కోర్టులో పెళ్లి
తమ బంధాన్ని కుటుంబ సభ్యులు, ఈ సమాజం ఎప్పటికీ ఒప్పుకోరని గ్రహించిన ఈ అత్తాఅల్లుళ్లు.. ఒకరోజు రహస్యంగా ఇళ్ల నుంచి పారిపోయారు. లోకం తమ గురించి ఏమనుకున్నా.. ఎలాంటి విమర్శలు చేసినా తమకు అనవసరమంటూ ఇద్దరూ కోర్టును ఆశ్రయించి చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తమ ప్రేమ బంధానికి వయస్సు, వరసలు అడ్డుకావని వారు స్పష్టం చేశారు.

కోర్టు సర్టిఫికేట్‌తో వీడియో వైరల్
న్యాయస్థానంలో పెళ్లి పూర్తయిన తర్వాత ఈ జంట తమ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. తామిద్దరం పూర్తి ఇష్టపూర్వకంగా, ఎవరి ఒత్తిడి లేకుండానే పెళ్లి చేసుకున్నామని ఆ వీడియోలో ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సమాజం, తమ కుటుంబ సభ్యులు తమ పవిత్ర బంధాన్ని అర్థం చేసుకుని, పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఈ కొత్త జంట కోరుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+