వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటలో మోదీ జెండా ఆవిష్కరణ... ప్రధానికి సహకరించిన ఆ అధికారి ఎవరో తెలుసా?

|
Google Oneindia TeluguNews

నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మహిళా ఆర్మీ అధికారి శ్వేత పాండే జెండా ఎగరవేయడంలో ప్రధానికి సహకరించారు. ఈ వేడుకలో మోదీతో పాటు ఆమె కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఎందుకీ నిర్ణయం...స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఎందుకీ నిర్ణయం...

మేజర్ శ్వేత పాండే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ 505 బేస్ వర్క్‌ షాప్‌లో ఎలక్ట్రానిక్స్&మెకానికల్ ఇంజనీర్‌గా సేవలందిస్తున్నారు. కెమికల్,బయోలాజికల్,రేడియోలాజికల్,న్యూక్లియర్‌(CBRN) నిపుణురాలిగా ఆమె పేరు సంపాదించారు.మహారాష్ట్రలోని పుణేలో ఉన్న మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బేసిక్ సీబీఆర్ఎన్,స్టాఫ్ సీబీఆర్ఎన్ కోర్సులను పూర్తి చేశారు.

Major Shweta Pandey assisted PM Narendra Modi hoist tricolor at Red Fort

Recommended Video

COVID -19 : ఫుడ్ డెలివరీ ద్వారా కరోనా వస్తుందా ? WHO ఏం చెప్పిందంటే ! || Oneindia Telugu

2012 మార్చిలో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆమె ఎంపికయ్యారు.కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన శ్వేత పాండే... రాడార్స్‌లో అడ్వాన్స్ కోర్సును పూర్తి చేశారు. చెన్నై ట్రైనింగ్ అకాడమీలో ఉండగా గర్హ్‌వాల్ రైఫిల్ మెడల్ కూడా సాధించారు.స్కూల్,కాలేజీలో విద్యనభ్యసిస్తుండగా జాతీయ,అంతర్జాతీయ స్థాయి ఉపన్యాస,చర్చ,తదితర పోటీల్లో దాదాపు 75 మెడల్స్ సాధించారు. అలాగే 250 సర్టిఫికెట్లు పొందారు. శ్వేత పాండే తండ్రి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిఖ శాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి హిందీ,సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday (August 15) unfurled the tricolour at Red Fort in the national capital and addressed the nation on the occasion of 74th Independence Day. Notably, the Prime Minister was assisted by woman Army officer — Shweta Pandey, as he hoisted the national flag from the ramparts of the Red Fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X