విరిగిన పట్టా: వందల మంది ప్రాణాలు కాపాడాడిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: ఢిల్లీ-హౌరా రైలుకు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఎరుపురంగు వస్త్రాన్ని చూపి రైలును ఆపడంతో రైలులో ప్రయాణీస్తున్న ప్రయాణీకులు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

ఓ వ్యక్తి అప్రమత్తత కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడింది. సమయానికి ఎరుపు రంగు వస్త్రం చూపించి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. హౌరా-దిల్లీ మార్గంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Major tragedy averted on Howrah-New Delhi route as man alerts driver in West Bengal

బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్‌ ప్రాంతంలో రైలు పట్టా విరిగి పోయి ఉండటాన్ని అటువైపుగా వెళ్తున్న స్థానికుడు గమనించాడు. అదే సమయంలో హౌరా-దిల్లీ రైలు అటువైపుగా వస్తోంది. ప్రమాదాన్ని గమనించిన అతడు వెంటనే ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపారు. ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని చూసిన డ్రైవరు ప్రమాదాన్ని గ్రహించి రైలును ఆపేశాడు.

స్థానికుడు చూపిన సమయస్పూర్తితో వందలాది ప్రాణాలు కాపాడినట్టైంది. పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వూపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పట్టాను సరిచేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి కాపాడినందుకుగాను రైల్వే అధికారులు అతడిని అభినందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A major train accident was averted on Howrah-New Delhi route in Burdwan district in West Bengal due to the alertness and swift action taken by a local resident on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి