హర్యానాలో బీజేపీని ముంచింది వారే ! ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది ఇదేనా..?

హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిపై పలు సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అయితే ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని తేల్చిచెప్పేశాయి. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు అయిన 46 సీట్ల కంటే ఎక్కువగానే కాంగ్రెస్ సాధించబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో అంకెల్లో కాస్త తేడా ఉన్నా హర్యానా మాత్రం కాంగ్రెస్ దేనని తేలిపోయింది.

హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓటర్లు ఈసారి తిరస్కరించినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన మూడు వర్గాల విషయంలో కేంద్రంలోని ఆ పార్టీ వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో ప్రభుత్వం దానికి మద్దతునిచ్చిన తీరు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో రైతులు, సైనికులు, రెజ్లర్లు ఉన్నారు. వీరిలో ప్రతీ వర్గం బీజేపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంది.

majority exit polls predicts big win for congress party in haryana-here are key reasons

కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొని ఢిల్లీ వరకూ వెళ్లి నిరసనలు చేశారు. వాటిని అడ్డుకునేందుకు పోలీసుల సాయంతో కేంద్రం వ్యవహరించిన తీరు రైతుల్లో ఆగ్రహం నింపింది. వ్యవసాయ చట్టాల్ని కేంద్రం వెనక్కి తీసుకున్నా రైతుల్లో ఆక్రోశం మాత్రం చల్లారలేదు. అలాగే సైనికుల కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం కూడా ఇలాంటిదే. దీనికి వ్యతిరేకంగా హర్యానాలో ఆందోళనలు జరిగాయి. సైన్యంలో ఎక్కువ మంది ఎంపికయ్యే రాష్ట్రమైన హర్యానాలో
ఇది ఆక్రోశం నింపింది. దాని ప్రభావం ఎన్నికలపై పడింది.

మరోవైపు మహిళా రెజ్లర్ల విషయంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా ఆ పార్టీపై ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా మహిళా రెజ్లర్లు తమపై లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేయడం, వారిని చులకన చేస్తూ బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు, బ్రిజ్ భూషణ్ కు మద్దతుగా నిలవడం వంటి కారణాలు రెజ్లర్లలో ఆగ్రహం నింపాయి. అప్పటికే బీజేపీపై ఆగ్రహంగా ఉన్న రైతులు, సైనికులు కూడా రెజ్లర్లకు అండగా నిలవడంతో ఆ పార్టీకి చుక్కలు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+