రాజ్యసభ మెజార్టీ బీజేపీకి అందని ద్రాక్షే-కీలకంగా యూపీ పోరు-వైసీపీకి అదనంగా మూడు
పార్లమెంటులో భారీ మెజారిటీతో 2014లో అధికారం చేపట్టిన మోడీ సర్కార్ దిగ్విజయంగా ఏడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయినా దిగువ సభ అయిన లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ ఏడేళ్లలో మెజారిటీ సాధించలేక చతికిలపడుతోంది. ఎప్పటికప్పుడు మెజారిటీకి చేరవవుతున్నట్లు కనిపిస్తున్నా మ్యాజిక్ మార్క్ మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. దీనికి ప్రధాన కారణం రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలే. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే మెజారిటీ మాట అటుంచి ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య కూడా కోల్పోక తప్పదు.

బీజేపీకి అందని ద్రాక్షగా రాజ్యసభ మెజారిటీ
245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న ప్రస్తుత సభ్యుల సంఖ్య 93 మాత్రమే. ఈ ఏడేళ్లలో పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయాలు అందుకున్నా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పరాజయాల్ని కాషాయ పార్టీ మూటగట్టుకుంది. దీంతో బీజేపీకి రాజ్యసభలో మజారిటీ మార్క్ సాధించడం అనేది అందని ద్రాక్షగా మారిపోతోంది. ఇప్పటికీ రాజ్యసభలో మెజారిటీకి అవసరమైన 123 సభ్యుల మార్క్‌కు 30 ఎంపీల దూరంలో ఉన్న బీజేపీ ఇప్పట్లో దాన్ని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు.

కీలకంగా యూపీ ఎన్నికలు
మరో 9 నెలల్లో జరగాల్సిన యూపీ ఎన్నికలు బీజేపీకి రాజ్యసభలో చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం యూపీలో ప్రజావ్యతిరేక విధానాలతో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాషాయ దళానికి వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఎన్నికల్లో గెలుపు అంత సులువుగా కనిపించడం లేదు. ప్రతిపక్షాలు క్రమంగా ఐక్యమవుతుండటం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత యూపీలో బీజేపీ పుట్టి ముంచేలా ఉన్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాది యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 93 సభ్యుల సంఖ్యను నిలబెట్టుకోవడం కూడా కష్టంగా మారనుంది. యూపీలో 11 రాజ్యసభ సీట్లు వచ్చే ఏడాది ఖాళీ అవుతుండగా..ఇందులో బీజేపీకి చెందిన ఐదుగురు ఎంపీలున్నారు. వీరిలో ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఫిరాయించినవారే. యూపీ ఎన్నికల్లో ఓడితే ఈ ఐదు సీట్లపై ఆశలు వదులుకోవడమే.

ఎంపీల రిటైర్మెంట్లతో మరిన్ని చిక్కులు
వచ్చే ఏడాది ఏకంగా 71 మంది రాజ్యసభ ఎంపీలు మూడు విడతల్లో పదవీ కాలాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇందులో ఏపీ, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎంపీలున్నారు. అసలే ఏపీలో సొంతంగా ఒక్క ఎంపీని కూడా గెల్చుకోలేని పరిస్దితుల్లో టీడీపీ ఎంపీల్ని లాక్కున్న బీజేపీ.. ఇప్పుడు తమకున్న నలుగురు ఎంపీల్ని కోల్పోనుంది. అలాగే రాజస్ధాన్, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అక్కడా రిటైర్ అవుతున్నఎంపీల స్దానంలో మరోసారి ఎంపీల్ని గెల్చుకునే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో యూపీలో తేడా కొడితే మాత్రం ప్రస్తుత సంఖ్యను సైతం బీజేపీ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో వైసీపీ ఖాతాలోకి బీజేపీ ఎంపీలు
వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణలో బీజేపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు రిటైర్ కానున్నారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీల స్ధానాల్లో వైసీపీ పాగా వేయబోతోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో భారీ మెజారిటీతో పటిష్టంగా ఉన్న వైసీపీ ఈ మూడు స్ధానాల్ని కచ్చితంగా కైవసం చేసుకోవడం ఖాయం. అలాగే తెలంగాణలో సైతం టీఆర్‌ఎస్ బీజేపీకి చెందిన ఎంపీ సీటును కైవసం చేసుకోవడం ఖాయమే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీలు మాయమైనట్లే.
Recommended Video
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications