వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా టెన్షన్: బెంగాల్‌లో గంగా సాగర్ మేళా.. లక్షలాదిగా తరలివస్తోన్న జనం

|
Google Oneindia TeluguNews

కరోనా థర్డ్ వేవ్ బెంబేలెత్తిస్తోంది. జనం గుమిగూడటం కూడా కేసులు పెరిగేందుకు దోహదం చేస్తుంది. గంగా సాగర్ మేళా జనం భారీగా తరలివస్తున్నారు. సాగర్ ద్వీప్‌కు జనం భారీగా వస్తున్నారు. లక్షలాది మంది రావడంతో ఆందోళన నెలకొంది. సంక్రాంతి సందర్భంగా జనం ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నారు.

మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇద్దరు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని.. పరిస్థితిని సమీక్షించాలని కూడా స్పష్టంచేసింది. మేళాలో కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారా..? లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలను పాటించాలని చీఫ్ సెక్రటరీకి డివిజన్ బెంచ్ స్పష్టంచేసింది. అంతేకాదు గత 72 గంటల్లో ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని.. నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది.

Makar Sankranti: Lakhs throng Gangasagar Mela amid Covid surge

శుక్రవారం జరిగిన మేళాకు లక్షలాది మంది జనం వచ్చారు. అయితే చాలా మంది మాస్క్ ధరించకుండా కనిపించారు. నదిలో స్నానం చేసే సమయంలో కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నదిలో స్నానం చేసే దైవ నామస్మరణ చేయడాన్ని గమనించేందుకు 20 ప్రత్యేక డ్రోన్ల కూడా ఏర్పాటు చేశాయని జిల్లా అధికారులు తెలియజేశారు. మాస్క్ తీసి కానీ, అరవడం వల్ల కరోనా నీటిలో వ్యాప్తి చెందే అవకాశాలను డ్రోన్లు పరిశీలిస్తాయి. సదరు డ్రోన్లు నీటిలో శానిటైజర్ కలుపుతాయని.. దీంతో వైరస్ వచ్చిన అక్కడే చనిపోతుందని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఒకసారి 50 మందిని మాత్రమే అనుమతిస్తారు.

మేళా జరిగే సమయంలో బెంగాల్‌లో రోజుకు 20 వేల కరోనా కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 30 శాతం ఉంది. గురువారం మాత్రం 32.13 శాతానికి చేరుకుంది. గుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ లక్షలాది మంది జనం వస్తున్నారు.

English summary
lakhs of devotees arrived at Sagardwip in the state, where the Gangasagar Mela is under way, to take a holy bath at the point where the Ganges joins the Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X