మోడీకి లేఖ రాసిన పన్నీర్ సెల్వం: సార్ చూడండి !

తమిళనాడులో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దయచేసి జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని .

చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దయచేసి జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పన్నీర్ సెల్వం మనవి చేశారు.

తమిళనాడు ప్రజలు సంప్రదాయ క్రీడగా జల్లికట్టును సంక్రాంతి పండగ సందర్బంగా నిర్వహిస్తారని, ఆ క్రీడ నిర్వహించడానికి ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారని పన్నీర్ సెల్వం ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లారు.

షాక్: కెప్టెన్ తో ఫోటో తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి, ఎంతంటే ?

తమిళనాడులో సంక్రాంతి పండగ సందర్బంగా వారం రోజుల పాటు జల్లికట్టు సాహస క్రీడను నిర్వహిస్తారని, జల్లికట్టుకు చాల విశిష్టత ఉందని పన్నీర్ సెల్వం తెలిపారు. జల్లికట్టుకు చట్టపరమైన ఇబ్బందులు తొలగించడానికి మీ వంతు కృషి చెయ్యాలని మోడీకి మనవి చేశారు.

Make Jallikattu legal: Tamil Nadu CM Panneerselvam writes to PM MOdi seeking ordinance on sport

గతంలో జల్లికట్టు నిర్వహణకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తగిన చర్యలు తీసుకున్నారని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. 2014లో సుప్రీం కోర్టు జల్లికట్టు సాహస క్రీడను నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే.

శశికళ దెబ్బ: జయలలిత మృతి, 'సీబీఐ, డీఓపీటీ'విచారణ

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీతో సహ తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకేతో సహ అన్ని రాజకీయ పార్టీలు జల్లికట్టు మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+