పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ: దుర్ఘటన స్థలానికి సీఎం
తిరువనంతపురం: కేరళలో చోొటు చేసుకున్న పడప ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో జలసమాధి అయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. గల్లంతయిన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ను చేపట్టాయి. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు.
ఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి స్వయంగా రానున్నారు. తిరువనంతపురం నుంచి ఆయన బయలుదేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇప్పటికే అటవీ శాఖ మంత్రి సశీంద్రన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్నారు.

మళప్పురం జిల్లాలోని తనూర్ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పర్యాటకులతో కూడిన బోట్ హౌస్.. ప్రమాదానికి గురైంది. నదీ జిలాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో బోట్ హౌస్‌లో 30 మంది పర్యాటకులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చని మంత్రి సశీంద్రన్ తెలిపారు. ప్రమాద సమయంలో బోట్ హౌస్‌లో ఎంతమంది ఉన్నారనేది ఖచ్చితంగా తెలియరావట్లేదని చెప్పారు.
బోట్ హౌస్ ప్రమాదానికి గురైన సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తనూర్‌కు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో తొలుత 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
జలాల్లో కొట్టుకుపోయిన మరిన్ని మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. ఈ ఘటనలో 22 మంది మరణించినట్లు నిర్ధారించారు. మిగిలినవారిని గాలించడానికి వైమానిక దళం సహాయ, సహాకారాలను తీసుకుంటోన్నారు. వైమానిక దళం హెలికాప్టర్‌ను రంగంలోకి దింపారు. కోస్ట్ గార్డ్ సిబ్బందిని రప్పించారు. స్కూబా డైవర్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.












Click it and Unblock the Notifications