చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మలేషియా విమానం చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమ్ స్టర్ డామ్ నుండి కౌలాలంపూర్ వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విషయం గమనించిన పైలెట్ వెంటనే అధికారులతో సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్-17 లో 230 మంది ప్రయాణికులను తీసుకుని అమ్ స్టర్ డామ్ నుండి కౌలాలంపూర్ బయలుదేరింది. గురువారం ఉదయం విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే పైలెట్ మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులకు సమాచారం అందించారు.

Malaysia Flight Makes Emergency Landing at Chennai in India on Thursday

అప్పటికే విమానం భారత్ లోని తమిళనాడు గగనతలంలో ఉందని తెలుసుకున్న మలేషియా అధికారులు చెన్నై విమానాశ్రయం అధికారులను సంప్రదించారు. చెన్నైలో విమానం ల్యాండింగ్ చెయ్యడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విమానం చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చెన్నై విమానాశ్రయం అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేశారు. తరువాత విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.

English summary
Malaysia Airlines said one of its jets made an unscheduled landing in India on Thursday due to broken lavatories while flying the same route as flight MH17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X