వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరైన పాక్.. సార్క్ ను బాయ్ కాట్ చేసిన మాల్దీవులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నవంబర్ లో పాక్ లోని ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సమావేశాన్ని భారత్ సహా ఇప్పటికే ఐదు దేశాలు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మాల్దీవులు కూడా చేరింది. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత్ కు మద్దతుగా భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇప్పటికే సార్క్ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా మాల్దీవులు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో దౌత్య వేదికలపై పాక్ ను ఏకాకి చేయాలన్న వ్యూహానికి భారత్ దక్షిణాసియా దేశాల మద్దతు కూడగట్టినట్టయింది. కాగా, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్)లో మొత్తం ఎనిమిది దేశాలున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు ఇందులో సభ్యత్వ దేశాలు. తాజాగా మాల్దీవులు కూడా సార్క్ ను బాయ్ కాట్ చేయడంతో.. సార్క్ దేశాలన్ని భారత్ వెంటే నడిచినట్టయింది.

Maldives calls on Saarc member states to create conducive environment for summit

ఇదిలా ఉంటే.. దక్షిణాసియా దేశాలన్ని ఒక్క తాటిపైకి వచ్చి పాక్ లో సార్క్ సమావేశాలను బహిష్కరించడంతో పాక్ కూడా చేసేది లేక సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు అధికార ప్రకటన చేసింది.

English summary
Saarc member nation Maldives has urged that the 19th summit be held at an early date than was scheduled, going against the majority view in the grouping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X