మోదీ మళ్లీ ప్రధాని అవుతారు, ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే సంచలన వ్యాఖ్యలు, బైమిస్ అయ్యిందా ?
పార్లమెంట్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్లమెంటు మొత్తం ఒక్కసారిగా నవ్వుల వర్షం కురిసింది. శుక్రవారం ఈ ఘటన పార్లమెంట్ లో చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రధాని నరేంద్ర మోడీని చూస్తూ చేసిన వ్యాఖ్యలతో ప్రధాని నరేంద్ర మోదీతో సహ అందరూ నవ్వేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్ లో మీకు ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉందని, గత లోక్ సభ ఎన్నికల్లో మీకు 330 నుంచి 340 సీట్లు వచ్చాయని, ఆసారి లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని అన్నారు. మల్లికార్జున్ ఖార్గే చేసిన ఈ ప్రకటన విన్న బీజేపీ ఎంపీలు చప్పట్లు కొట్టారు. అదే సమయంలో పార్లమెంట్ సభ ఒక్కసారిగా నవ్వులతో దద్దరిల్లింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పెద్దగా నవ్వడం ప్రారంభించారు.

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సభ్యులు బిగ్గరగా నవ్వుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ అధికారిక X (ట్విట్టర్)లో ఈ వీడియోను షేర్ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే స్వయంగా ప్రకటించారని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
2019లో సాధించిన 303 లోక్ సభ స్థానాలను అధిగమించి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. జేపీ నడ్డా నేతృత్వంలోని బీజేపీ ఇప్పటికే NDA ప్రభుత్వ విజయాలను హైలైట్ చేసే థీమ్ సాంగ్‌తో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అవుతారని మల్లికార్జున్ ఖార్గే స్వయంగా రాజ్యసభలో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభలో మాట్లాడిన ఈ వీడియోను బీజేపీ ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే జోస్యం చెప్పారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications