నోట్ల రద్దు ఓ సిగ్గుచేటు ఫ్లాప్ షో: మళ్లీ నిరసన బాటలో మమతా..
నోట్ల రద్దు పేరుతో నవంబర్8 నుంచి అమలులోకి వచ్చిన ఆంక్షలను ఎత్తివేయాలని మమతా డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కతా: గతేడాది నవంబర్ 8న కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ల రద్దు తర్వాతి పరిణామాల తర్వాత సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో మరోసారి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, భువనేశ్వర్,పంజాబ్,కిషన్ గంజ్(బీహార్), మణిపూర్, త్రిపుర, అస్సాం, జార్ఖండ్, ఢిల్లీల్లో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్టు మమతా తెలియజేశారు. నోట్ల రద్దును ఓ సిగ్గుచేటు ప్లాఫ్ 'షో' గా అభివర్ణిస్తూ ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.

సోమ, మంగళ, బుధవారం రోజుల్లో ఈ ధర్నాలు చేపట్టబోతున్నట్టుగా వివరించారు. నోట్ల రద్దు పేరుతో నవంబర్8 నుంచి అమలులోకి వచ్చిన ఆంక్షలను ఎత్తివేయాలని మమతా డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కాగా, మొన్నీమధ్యే ప్రధాని మోడీని ఆ స్థానం నుంచి దించివేయాలని సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ లేదా రాజ్ నాథ్ సింగ్ ను కూర్చోబెట్టాలని మమతా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications