వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనికులకు పరిహారం ఇస్తున్నారా? బిచ్చం వేస్తున్నారా? : మమతాపై నెటిజెన్స్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : యూరీ ఉగ్ర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తోన్న తీరు వివాదస్పదమవుతోంది. నష్ట పరిహారం బిచ్చగాళ్లకు వేసినట్టు ముష్టి వేస్తున్నారంటూ.. పలువురు నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా నెటిజెన్స్ సెగ తగిలింది.

అమరులైన వీర సైనికుల కోసం బెంగాల్ ప్రభుత్వం తరుపున రూ.2లక్షలు ప్రకటించింది మమతా సర్కార్. దీంతో పాటు సైనికుడి ఇంట్లో ఒకరికి హోంగార్డు ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించింది. మమతా సర్కార్ ఇచ్చిన పరిహారంపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తోన్న నెటిజెన్లు.. 'వీరజవాన్లు బిచ్చగాళ్లు కాదంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్' ద్వారా మమతా సర్కార్ పై వ్యతిరేకత చాటుకుంటున్నారు.

ఇకపోతే మమతా సర్కార్ ప్రకటించిన పరిహారాన్ని, హోంగార్డు ఉద్యోగాన్ని సైనికుల కుటుంబాలు సైతం తిరస్కరించాయి. గతేడాది మక్కా సందర్శనకు వెళ్లి మరణించినవాళ్లకు రూ.10లక్షలు మంజూరు చేసిన సీఎం మమతా బెనర్జీ.. దేశం కోసం అమరులైన సైనికులకు మాత్రం కేవలం రూ.2లక్షలు చెల్లించడమేంటని నెటిజెన్స్ మండిపడుతున్నారు. మమతా బెనర్జీ పాటించే లౌకికవాదం ఇదేనా అంటూ ఆమెను నిలదీస్తున్నారు.

Mamata Banerjee gets slammed on Twitter for giving Rs 2 lakh compensation to Uri martyrs

నితీశ్ కు తప్పని ఛీత్కారాలు:

యూరీ ఘటనలో అమరులైన సైనికులకు రూ.5లక్షల నష్ట పరిహారం ప్రకటించింది నితీశ్ సర్కార్. దీంతో మీ ముష్టి సహాయం మాకొద్దంటూ సైనిక కుటుంబాలు ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించాయి. 'నా భర్త తప్పతాగి డ్రైనేజిలో పడి చనిపోయిన వ్యక్తేమి కాదు' అంటూ అమర జవాన్ అశోక్ కుమార్ భార్య నితీశ్ సర్కార్ ప్రకటించిన సహాయాన్ని తిరస్కరించారు. దీంతో పరిహారాన్ని రూ.11లక్షలకు పెంచింది ప్రభుత్వం.

ఇదంతా ఇలా ఉంటే.. ఒలింపిక్స్ లో పతాకాలు సాధించే క్రీడాకారులకు కోట్లు కుమ్మరించే ప్రభుత్వాలు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు మాత్రం ఇలా ముష్టి సహాయాల్ని అందజేయమేంటని సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee was in the firing line of Twiterrati today for announcing Rs 2 lakh compensation for the families of the soldiers from her state who lost their lives for the country in Sunday’s attack by four Pakistani terrorists in Uri, Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X