మీకు ధైర్యం ఉంటే నా శరీరంపై బుల్డోజర్ నడపండి: మమత బెనర్జీ సవాల్

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళీ పూజ, దీపావళి పండుగల సమయంలో కోల్‌కతాలోని తమ నివాస ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి సమీపంలో అర్ధరాత్రి వేళ దాడులకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారని మండిపడ్డారు.

పండగ వేడుకలు జరుగుతున్న సమయంలో వేకువ జామున 2, 3 గంటల ప్రాంతంలో గుండాలతో దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఏళ్లుగా తమ నియోజకవర్గంలో సాగుతున్న సాంప్రదాయ కాళీ పూజల నిర్వహణను అడ్డుకోవడానికే బీజేపీ ఈ రకమైన చర్యలకు దిగుతోందని విమర్శించారు. కాళీ మాత ఊరేగింపులు సాగే మార్గాల్లో కావాలనే అడ్డంకులు సృష్టిస్తోన్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Mamata Banerjee hit out at the BJP govt over attack on MP Abhishek Banerjee residence and Kali Puja

రాజకీయ ప్రత్యర్థుల బెదిరింపు ధోరణిపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి ధైర్యం ఉంటే తమ శరీరాలపై బుల్డోజర్లు నడపాలని సవాల్ విసిరారు. అర్ధరాత్రి వేళ అల్లరిమూకలతో వచ్చి తమ పార్టీ కార్యకలాపాలు, కాళీ పూజ నిర్వహణను అడ్డుకోవడం అక్రమమని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ లో తమ పార్టీ కీలక పాత్ర పోషించడమే ఈ కక్షసాధింపు చర్యలకు ప్రధాన కారణమని మమత బెనర్జీ స్పష్టం చేశారు.

రేపు, ఎల్లుండి తిరుమలలో ట్రయల్ రన్ నిలిపివేత
రేపు, ఎల్లుండి తిరుమలలో ట్రయల్ రన్ నిలిపివేత

ఈ రాజకీయ కుట్రల వెనుక పెద్ద ఎత్తున అక్రమ నిధుల పంపిణీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయం నుంచే నకిలీ అఫిడవిట్లు, బోగస్ స్టాంపులు వస్తున్నాయని విమర్శించారు. బెంగాల్‌లోని కొందరు బీజేపీ నేతలు ఈ నిధులను సరఫరా చేస్తున్నారని, ప్రజల ఓటర్ కార్డులను దుర్వినియోగం చేస్తూ, పోలీసు వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి ఫామ్‌లపై సంతకాలు చేయిస్తోన్నారని మమత బెనర్జీ మండిపడ్డారు.

దీపావళికి తీపికబురు ఇచ్చిన సీఎం విజయ్
దీపావళికి తీపికబురు ఇచ్చిన సీఎం విజయ్

పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక జీవితంలో కాళీ పూజ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అలాంటి సంప్రదాయాలను సువేందు అధికారి ప్రభుత్వం తుంగలోకి తొక్కే ప్రయత్నానికి పాల్పడుతోందని మమత బెనర్జీ దుమ్మెత్తిపోశారు. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రత అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. పండుగ వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, పూజా కమిటీల అనుమతుల చుట్టూ వివాదాలు ముదరడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+