2019 ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి, బాబు-కేసీఆర్‌లదే అధికారం: ఢిల్లీలో మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలు చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటాయని చెప్పారు. ఆమె ఢిల్లీలో వివిధ పార్టీ నేతలను, ఎంపీలను కలిశారు. శివసేన ఎంపీలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోను సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారని చెప్పారు. ఇందులో దాచి పెట్టడానికి ఏదీ లేదన్నారు. వచ్చే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయన్నారు. తాను రేపు బీజేపీ సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి తదితరులను కలుస్తానని చెప్పారు.
అందరినీ కలుస్తా
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, తాను మరోసారి ఆమెను కలుస్తానని మమతా బెనర్జీ చెప్పారు. రేపు (బుధవారం) మాత్రం శత్రుఘ్ను సిన్హా, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలను కలవనున్నట్లు తెలిపారు.
ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో టీఆర్ఎస్
బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అఖిలేష్ యాదవ్‌లు తమను సమావేశం కోసం లక్నోకు పిలిస్తే వెళ్తానని మమతా బెనర్జీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారని కూడా తెలుస్తోంది.
వీరిని కలిశారు
కాగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో పలు పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీలో శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలతో పాటు పలువురు నేతలతో చర్చించారు.
ప్రాంతీయ పార్టీల బలోపేతం
త్వరలో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతోను చర్చించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తోనూ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఆమె ప్రాంతీయ పార్టీల బలోపేతం అంశంపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 2019 ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కంటే.. బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగా ఉంటాయని చాలామంది భావిస్తున్నారు.
Delhi: West Bengal CM Mamta Banerjee met TRS MP K Kavitha earlier today pic.twitter.com/EfasBFrK8b
— ANI (@ANI) March 27, 2018
Yes, Sonia ji is unwell right now and recovering, will meet her once she is fine.Tomorrow will meet Shatrughan Sinha ji,Yashwant Sinha ji, and Arun Shourie ji. Will certainly go if they(Mayawati-Akhilesh Yadav) call us for a meeting to Lucknow: WB CM Mamata Banerjee pic.twitter.com/IV6YdNvAKx
— ANI (@ANI) March 27, 2018












Click it and Unblock the Notifications