చేతులు నరికేస్తాం: కాంగ్రెసువారిపై దీదీ పార్టీ నేత

కోల్‌కతా: తమ పార్టీకి, ముఖ్యమంత్రికి మమతా బెనర్జీకి సంబంధించిన పోస్టర్ల గానీ, హోర్డింగులను గానీ చించివేసిన వారిని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఆ పార్టీ నేత ఒకరు తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే... తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం, జెండాలను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోస్టర్ల విధ్వంసానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తల చేతులను తమ పార్టీ కార్యకర్తలు నరికి వేస్తారని బిర్భూమ్ జిల్లా తృణమూల్ పార్టీ అధ్యక్షుడు అనుబ్రత మండల్ హెచ్చరించాడు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్దువాన్ జిల్లాలోని కట్వా ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పై విధంగా స్పందించారు. అనుబ్రత మండల్ వ్యాఖ్యల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో మార్పును మాత్రమే కోరుకుంటున్నానని, విధ్వేషాన్ని కాదని చెప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని సిపిఎం నాయకుడు బిమన్ బోస్ ఆరోపించారు.

Mamata Banerjee

తృణమూల్ పార్టీ నేత వ్యాఖ్యలతో తాము ఆశ్చర్యానికి గురి కాలేదని, వారు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు కూడా మార్పు కోరుకుంటారని, వారి ప్రభుత్వ స్థానంలో వేరొకరికి పట్టం కడతారని భారతీయ జనతా పార్టీ నాయకుడు సమిక్ భట్టాచార్య అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అండదండలతోనే అనుబ్రత్ మండల్ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని రాష్ట్ర కాంగ్రెస్ నేత ఓంప్రకాశ్ మిశ్రా ఆరోపించారు.

అనుబ్రత్ మండల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థుల ఇళ్లను కాల్చివేసేందుకు తృణమూల్ పార్టీ మద్దతుదారులు ప్రయత్నించారని, భాధితులను కాపాడేందుకు వచ్చే పోలీసులపై బాంబులు వేసేందుకు కూడా యత్నించారని వారు ఆరోపించారు. దీనింతటికీ అనుబ్రత్ మండల్‌ చేసిన విద్వేష ప్రసంగాలే కారణమని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+