నందిగ్రామ్ లో మమతా బెనర్జీ విజయం .. 1200 ఓట్లతో సువేందుపై దీదీ విక్టరీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఒంటి కాలితో ఆడేసుకున్నారు. బెంగాల్ లో విజయకేతనం ఎగరవేసే పనిలో ఉన్నారు. హోరాహోరీ పోరాటం,తీవ్ర ఉత్కంఠ మధ్య నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత బెనర్జీ విజయం సాధించారు. బిజెపి నుండి బరిలోకి దిగిన, ఒకప్పటి టీఎంసీ నేత, మమతా బెనర్జీకి కుడిభుజంగా వ్యవహరించిన సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

సువేందు అధికారిపై పోటీ చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లో 292 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా , అన్ని నియోజక వర్గాలు ఒక ఎత్తయితే నందిగ్రామ్ నియోజకవర్గం ఒక ఎత్తు గా మారింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, గతంలో తనకు కుడిభుజంగా ఉన్న ,ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారిపై పోటీకి దిగారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అక్కడ ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు.

మొదటి ఆరు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన సువేందు అధికారి
మొదటి నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్ లో వెనుకంజలో కొనసాగిన మమతా బెనర్జీ, ఆరవ రౌండ్ ముగిసే సరికి లీడ్ లోకి వచ్చారు. మమతా బెనర్జీ , సువేందు అధికారి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు లాస్ట్ రౌండ్ లో ఆరు ఓట్ల తేడాతో పోరాటం సాగించిన దీదీ చివరి రౌండ్ లో 1200 ఓట్లతో బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ విజయం సాధించారు. అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సువేందు అధికారి సైతం మమతా బెనర్జీ కి టఫ్ ఫైట్ ఇచ్చారు. మొదటి నుంచి తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన కౌంటింగ్ లో మమతా బెనర్జీ సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

ఎట్టకేలకు మమతా బెనర్జీ విజయం
17 రౌండ్ల ఓట్ల లెక్కింపు తరువాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి సువేందు అధికారికి వ్యతిరేకంగా 1200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక రాష్ట్రంలోనూ తిరుగులేని విధంగా బిజెపి ని వెనక్కి నెట్టి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.ఆమె మ్యాజిక్ ఫిగర్ 200 ను దాటి దూసుకెళుతున్న పరిస్థితి ఉంది . బెంగాల్ లో మమతా బెనర్జీ సాహసోపేతమైన ఎన్నికల పోరును దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు .

దేశం మొత్తం ఎన్నికల ఫలితాలు ఒకఎత్తు , నందిగ్రామ్ ఒక ఎత్తు : చివరి వరకూ సస్పెన్స్
ప్రస్తుతం తమిళనాడు, కేరళ, అస్సాం , పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు వస్తున్నా దేశం దృష్టి మాత్రం బీజేపీతో హోరాహోరీగా తలపడిన , పెద్ద పోరాటమే చేసిన మమతా బెనర్జీపైనే ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశం ఆసక్తి కొనసాగుతుంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ పై ప్రత్యేక దృష్టి ఉంది. చివరి వరకూఇక్కడ కౌంటింగ్ పై సస్పెన్స్ కొనసాగింది .












Click it and Unblock the Notifications