విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి - ఇద్దరి పేర్లు పరిశీలన : 17 పార్టీల నేతల హాజరు..!!
రాష్ట్రపతి ఎన్నికల పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. ఉమ్మడి అభ్యర్ధిని బరిలో నిలపాని సమావేశంలో నిర్ణయించారు. ఆప్.. టీఆర్ఎస్..బీజేడీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. విపక్ష కూటమి అభ్యర్ధిగా శరద్ పవార్ పేరును ప్రతిపాదించగా..ఆయన తిరస్కరించారు. దీంతో..మరో ఇద్దరి పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. మోదీ ప్రభుత్వాన్ని ఆపగలిగే వ్యక్తిని నిలపాలని నిర్ణయించినట్లు సుధీంద్ర కులకర్ణి చెప్పుకొచ్చారు.
అభ్యర్థిని బరిలో నిలపాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. సమావేశానికి హాజరుకాని వారిని సైతం సంప్రదిస్తామని, ఇది ఒక మంచి ఆరంభమన్నారు. కొన్ని నెలల తర్వాత అంతా కలిసి సమావేశమయ్యామని, భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, జై రామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్సీపీ నుంచి శరద్ పవార్ .. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు.

సీపీఎం ఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, ఎలమరం కరీం పాల్గొన్నారు. శివసేన నుంచి ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, అదే విధ:గా.. సీపీఐ నుంచి డి. రాజా.. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా తో పాటుగా జేడీఎస్ నుంచి దేవెగౌడ - కుమార స్వామి, డీఎంకే నుంచి హాజరైన టిఆర్ బాలు హాజరయ్యారు. అయితే, పవార్ తాను పోటీ చేయటం పైన ఆసక్తి చూపించకపోవటంతో ఫరూక్ అబ్దుల్లా పేరు పైన చర్చ జరిగింది. అదే విధంగా గాంధీ మనవడు గోపాల గాంధీ పేరు పైన చర్చ జరిగింది.
అయితే, తుది నిర్ణయం తీసుకోలేదు. హాజరు కాని వారితోనూ చర్చలు చేసి..అదే సమయంలో ఎన్డీఏ నుంచి ఏకాభిప్రాయం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సైతం విపక్ష నేతలు గమనిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్ధి ఎవరనేది క్లారిటీ వచ్చిన తరువాత మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications