లోక్‌సభ ఎన్నికల్లో మోదీ vs ప్రియాంక గాంధీ: రసవత్తరం: విపక్షాల గేమ్ స్టార్ట్

PM Modi vs Priyanka Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చింది.

దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరు, ముంబైల్లో భేటీ కొనసాగింది. నాలుగో విడతగా దేశ రాజధానిలో ఈ సమావేశం అయ్యాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 28 పక్షాలు ఇందులో కొనసాగుతున్నాయి.

Mamata Banerjee suggested Priyanka Gandhi to contest against PM Modi in Varanasi in Lok Sabha 2024

ఈ భేటీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక ప్రతిపాదన చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని దింపాలని సూచించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా వారణాశి నుంచి ప్రియాంక గాంధీకి టికెట్ ఇస్తే తాము మద్దతు ఇస్తామని అన్నారు.

2014, 2019 ఎన్నికల్లో వారణాశి నుంచి పోటీ లోక్‌సభకు పోటీ చేశారు మోదీ. రెండు సార్లూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014లో కంటే 2019లో మోదీ మెజారిటీ పెరిగింది కూడా. ఈ సారి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయడం దాదాపుగా ఖాయం కావొచ్చు. వారణాశితో పాటు తెలంగాణ లేదా కేరళల్లో ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిల్చుంటారనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో వారణాశిలో మోదీపై ప్రియాంక గాంధీని పోటీకి దింపాలనే ప్రతిపాదన తెర మీదికి వచ్చింది. మమత బెనర్జీ స్వయంగా ఈ సూచన చేయడం, ఆమెకు మద్దతు సైతం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీపై ప్రియాంక గాంధీ వాద్రా పోటీకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

ప్రియాంక గాంధీని పార్టీ తురుఫుముక్కగా భావిస్తోన్నారు పార్టీ నాయకులు. ఇప్పటివరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో రంగంలోకి దిగిన ప్రియాంకకు ఉత్తర ప్రదేశ్ రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీగా వ్యవహారించారు. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+