వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ వర్సెస్ సీబీఐ.. కోల్‌కతాకు చంద్రబాబు, కనిమొళి!: సీబీఐ జేడీకి సమన్లు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో మమతా బెనర్జీ - ఆమె నేతృత్వంలో పోలీసులకు సీబీఐకి మధ్య వార్ చల్లారలేదు. కోల్‌కతా పోలీసులు సోమవారం నాడు అక్కడి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌కు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కోల్‌కతా నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

మరోవైపు, తమ పోరు సీబీఐ పైన కాదని, ప్రధాని నరేంద్ర మోడీ పైన అని మమతా బెనర్జీ చెప్పారు. ఆమె కోల్‌కతాలో ధర్నాకు కూర్చున్న విషయం తెలిసిందే. ఆమెకు మద్దతు తెలిపేందుకు విపక్షాలకు చెందిన పలువురు నేతలు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీఎంకే నేత కనిమొళి తదితరులు రానున్నారు. కనిమొళి సోమవారం రాత్రికి కోల్‌కతా చేరుకోనున్నారు. చంద్రబాబు ఎప్పుడు చేరుకుంటా

 Mamata Banerjee vs CBI: BJP office vandalised, Trinamool depicts Modi as Hitler in Kolkata rally

బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీజేపీ కార్యాలయాలపై దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇలాంటివి చేస్తుంటారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

గతంలో మమత ఏం చేసిందో, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని కేంద్రమంత్రి బబూల్ సుప్రియో అన్నారు. యూపీఏ హయాంలో సీబీఐ పంజరంలో చిలుక మాదిరిగా ఉందని, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. ఇప్పుడు సీబీఐ తన పని తాను నిర్వర్తిస్తోందన్నారు.

మమత దీక్షకు రాహుల్ గాంధీ మద్దతు, బీజేపీ కౌంటర్

మమతా బెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటంచారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. గతంలో శారదా స్కాంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. 'మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న రాహుల్‌ జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం' అని పేర్కొంది. దేశంలోని వ్యవస్థలపై మోడీ, బీజేపీ చేస్తున్న దాడుల్లో ఇది భాగమని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

నిన్న ఏం జరిగిందంటే?

ఆదివారం రాత్రి కోల్‌కతాలో హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. శారదా కుంభకోణం, రోజ్ వ్యాలీ కుంభకోణాల్లో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. సీపీ పరారీలో ఉన్నందునే తాము నేరుగా ఇంటికి వెళ్లవలసి వచ్చిందని సీబీఐ చెప్పింది. సీబీఐ అధికారులు.. సీపీ నివాసానికి చేరుకోగానే కోల్‌కతా పోలీసులు అక్కడకు వెళ్లి సీబీఐ అధికారులను నిలువరించారు. వారిని అదుపులోకి తీసుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఇది కలకలం రేపింది. దీంతో మమతా బెనర్జీ కూడా సీబీఐ అధికారులు.. సీపీని విచారించకుండా ఉండేందుకు, ఆయనకు మద్దతుగా ఆయన నివాసానికి చేరుకుంది. అనంతరం ధర్నాకూ దిగారు. తమ అధికారులను అరెస్టు చేయడంపై సీబీఐ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.

English summary
Mamata Banerjee versus CBI: The showdown between West Bengal Chief Minister Mamata Banerjee and the Central Bureau of Investigation (CBI) that came out in the open on Sunday continues today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X