మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి: కలకత్తా హైకోర్టులో నందిగ్రామ్ ఎన్నిక విచారణ జూన్ 24కు వాయిదా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుండి తనపై పోటీ చేసిన సువేందు అధికారిని వదిలి పెట్టడం లేదు. పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ చీఫ్ సువేందు అధికారి ఎన్నికపై అనుమానాలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో సవాల్ చేశారు. ఇక మమతా బెనర్జీ పిటిషన్ ను పరిశీలించిన కలకత్తా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే జస్టిస్ చందా ముందు ఈ కేసు విచారణకు వెళ్లిన సమయంలో ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేయాలని ముఖ్యమంత్రి తరపు న్యాయవాది సౌమేంద్ర నాథ్ ముఖర్జీ అభ్యర్ధించారు. కోర్టు అభ్యర్థనను అంగీకరించి ఈ కేసును వచ్చే గురువారం అంటే జూన్ 24వ తేదీకి వాయిదా వేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో సువేందు అధికారి రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుండి గెలుపొందారు. మొదట మమతా బెనర్జీ గెలిచినట్లు ప్రకటించిన, తరువాత మళ్లీ పలు నాటకీయ పరిణామాల మధ్య సువేందు అధికారి గెలిచినట్లుగా వెల్లడించారు. మమతా బెనర్జీ రీకౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ ను విజ్ఞప్తి చేసినా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

ఈనేపథ్యంలో కోర్టును ఆశ్రయిస్తా అని చెప్పిన మమత అదేవిధంగా కోర్టు మెట్లు ఎక్కారు. ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పని చేస్తున్న కిశోర్ బిశ్వాస్ కు సైతం రక్షణ కల్పించిన మమతాబెనర్జీ ఈ రోజు కోర్టులో కేసు విచారణకు రాగా, కోర్టు ముఖ్యమంత్రి తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ కేసును జూన్ 24వ తేదీన కేసును పరిశీలించనుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications