Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరికీ మమత బెనర్జీ షాక్: కోల్‌కతాలో దుమ్మురేపిన టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దుమ్మురేపింది. ఇటీవల కేఎంసీ, సివిక్ పోల్స్ జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. ఇందులో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.

కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్‌లో 144 వార్డులు ఉన్నాయి. ఇందులో టీఎంసీ 110 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది. వామపక్షాలు కేవలం 16 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది.

Mamata dedicates Bengal civic poll victory to Rabindranath Tagore & common people

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారిన భారతీయ జనతా పార్టీ తొమ్మిది, కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో 51 సివిక్ బాడీల్లో టీఎంసీ గెలుపొందుతోంది. కాంగ్రెస్ ఆరు, లెఫ్ట్ ఫ్రెంట్ ఐదు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 92 పురపాలక సంస్థల ఫలితాల్లో అరవై శాతానికి పైగా తృణమూల్ ఆధిక్యంలో ఉంది.

Mamata dedicates Bengal civic poll victory to Rabindranath Tagore & common people

కాగా, గెలుపు పైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ గెలుపును రవీంద్ర నాథ్ ఠాగూర్‌కు అంకితం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.

అలాగే, ఈ గెలుపును బెంగాల్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. అయితే, భూకంపం విషాదం నేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక పార్టీ నాయకులు ర్యాలీలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+