ఐసిస్ చేతిలో 39 మంది ఇండియన్స్ మృతి: మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
కోల్‌కతా: ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులు చంపబడ్డారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మోసుల్ నుంచి ఈ వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది చాలా విచారకరమని, ఆ 39 మంది కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు రావడం లేదన్నారు. వారికి ఆ దేవుడు అండగా ఉండాలన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా సంతాపం తెలియజేసింది. ఇది చాలా బాధాకరమైన సమయమని, ఇలాంటి సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయాలని, ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.












Click it and Unblock the Notifications